మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

శ్రీ రామ రామ -శ్రీ రామ రామ


శ్రీ రామాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శ్రీ రామాష్టోత్తర శతావిర్భావము

పార్వతి మహేశ్వరునితో "నాథా ! ఉత్తమమైన వైష్ణవ ధర్మమును బాగుగా వర్ణించితిరి. వాస్తవముగా పరమాత్మ శ్రీ విష్ణు స్వరూపము గోప్యములలో అత్యంత గోప్యమైనది. పరమేశ్వరా ! నేను మీ దయచే ధన్యురాలనయితి. నేను కూడ సూతన భగవానుడగు శ్రీ హరిని పూజించెద ననెను.
మహేశ్వరుడు "దేవీ! చాల మంచిది. నీవు భగవానుడు లక్ష్మీపతిని అవశ్యము పూజింపు' మనెను.
మహేశ్వరుని ఉపదేశానుసారము పార్వతి ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ పఠనానంతరము భుజించు చుండెను.
ఒక దినము పరము మనోహరమైన కైలాస శిఖరముపై శ్రీ విష్ణు భగవానుని, శంకర భగవానుడు ఆరాధించి పార్వతీ దేవిని తనతో కలసి భుజించుటకు రమ్మని పిలిచెను.
అప్పుడు పార్వతి " ప్రభూ! నేను శ్రీ విష్ణు సహస్ర నామము పఠించిన తరువాత భుజించెదను. ముందు మీరు భుజింపు"డనెను.
ఇది వినిన మహేశ్వరుడు నవ్వుచు "పార్వతీ ! విష్ణువు నందు భక్తి కలదు. కావున నీవు ధన్యురాలవు, పుణ్యాత్మురాలవు. దేవీ! భాగ్యహీనులకు శ్రీ విష్ణు భక్తి లభించుట చాల కష్టము. సుముఖీ!
నేనును రామ ! రామ ! రామ ! అను జపము చేయుచు పరమ మనోహరమైన శ్రీరామ నామములో నిరంతరము రమించు

చుందును. రామనామము సంపూర్ణ సహస్రనామమునకు సమానము. పార్వతీ ! రకారాది నామము వినిన నామనస్సు ప్రసన్నముగ నుండును. నీవు రామ నామము నుచ్చరించి నాతో కలసి భుజింపు" మనెను.
అప్పుడు పార్వతి రామనామము నుచ్చరించి శంకర భగవానునితో కలసి భుజించెను.
ప్రసన్నురాలయిన పార్వతి "దేవేశ్వరా ! మీరు రామనామ . మును సంపూర్ణ సహస్ర నామమునకు సమానముగ చెప్పితిరి. ఇది వినిన నాకు రామనామ మందు గొప్ప భక్తి కలిగినది. అందువలన శ్రీరామునకు ఇంకేవయిన నామములున్న చెప్పు" డనెను.
మహేశ్వరుడు "పార్వతీ! వినుము. నేను శ్రీరామ చంద్రుని నామములు వర్ణించుచున్నాను. లౌకిక వైదిక శబ్దము లన్నియు శ్రీరామ చంద్రుని నామములే, కాని సహస్ర నామము వానిలో గొప్పది. మరియు ఆ సహస్ర నామము కంటెను శ్రీరాము నికి నూట ఎనిమిది నామములు అధిక ప్రధానమైనవి. శ్రీ విష్ణు నామములలో ఒకొక్కటి వేదములకంటెను అధికమైనది.
శ్రీరామ నామము సహస్ర నామములకు సమానము. పార్వతీ ! సమస్త మంత్రములు సమస్త వేదములు జపించిన గలుగు కోటి రెట్లు పుణ్యము కేవలము రామ నామముతో లభించును. శుభే ! శ్రీరాముని ముఖ్యమైన నామములు వర్ణించు చున్నాను వినుము. వీనినే మహుర్షులు గానము చేసిరి.

శ్రీ రామాష్టోత్తర శత నామావళిః

శ్రీ రామాష్టోత్తర శత నామావళిః |

1 ఓం శ్రీరామాయ నమః
2 ఓం రామ భద్రాయ నమః
3 ఓం రామచంద్రాయ నమః
4 ఓం శాశ్వతాయ నమః
5 ఓం రాజీవ లోచనాయ నమః
6 ఓం శ్రీమతే నమః
7 ఓం రాజేంద్రాయ నమః
8 ఓం రఘు పుంగవాయ నమః
9 ఓం జానకీ వల్లభాయ నమః
10 ఓం జైత్రాయ నమః
11 ఓం జితామిత్రాయ నమః
12 ఓం జనార్ధనాయ నమః
13 ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః
14 ఓం దాంతాయ నమః
15 ఓం శరణత్రాణతత్పరాయ నమః
16 ఓం వాలిప్రమథనాయ నమః
17 ఓం వాగ్మినే నమః
18 ఓం సత్యవాచే నమః
19 ఓం సత్య విక్రమాయ నమః
20 ఓం సత్యవ్రతాయ నమః
21 ఓం వ్రత ధరాయ నమః
22 ఓం సదాహనుమదాశ్రితాయ నమః
23 ఓం కౌసలేయాయ నమః
24 ఓం ఖరధ్వంసినే నమః
25 ఓం విరాధ వధ పండితాయ నమః
26 ఓం విభీషణ పరిత్రాత్రే నమః
27 ఓం హరకోదండ ఖండనాయ నమః
28 ఓం సప్తసాల ప్రభేత్రే నమః
29 ఓం దశగ్రీవ శిరోహరాయ నమః
30 ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమః
31 ఓం తాట కాంత కాయ నమః
32 ఓం వేదాన్త సారాయ నమః
33 ఓం వేదాత్మనే నమః
34 ఓం భవరోగస్య భేషజాయ నమః
35 ఓం దూషణత్రిశిరో హంత్రే నమః
36 ఓం త్రిమూర్తయే నమః
37 ఓం త్రిగుణాత్మకాయ నమః
38 ఓం త్రివిక్రమాయ నమః
39 ఓం త్రిలోకాత్మనే నమః
40 ఓం పుణ్య చారిత్ర కీర్తనాయ నమః
41 ఓం త్రిలోక రక్షకాయ నమః
42 ఓం ధ్వనినే నమః
43 ఓం దండకారణ్య వాస కృత్ నమః
44 ఓం అహల్యాశాపశమనాయ నమః
45 ఓం పితృభక్తాయ నమః
46 ఓం వరప్రదాయ నమః
47 ఓం జితేంద్రియాయ నమః
48 ఓం జితక్రోధాయ నమః
49 ఓం జిత మిత్రాయ నమః
50 ఓం జగద్గురవే నమః
51 ఓం ఋష వానర సంఘాలినే నమః
52 ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః
53 ఓం జయన్త త్రాణ వరదాయ నమః
54 ఓం సుమిత్రాపుత్ర సేవితాయనను:
55 ఓం సర్వ దేవాధి దేవాయ నమః
56 ఓం సర్వతీర్థ మయాయ నమః
57 ఓం మాయామానుష చారిత్రాయ నమః
58 ఓం హరయే నమః
59 ఓం మహాదేవాది పూజితాయ నమః
60 ఓం సేతు కృతే నమః
61 ఓం మృతవానర జీవనాయననుః
62 ఓం జితనారాశయే నమః
63 ఓం మాయా మారీచ హంత్రే నమః
64 ఓం మహాదేవాయ నమః
65 ఓం మహాభుజాయ నమః
66 ఓం సర్వదేవస్తుతాయ నమః
67 ఓం సౌమ్యాయ నమః
68 ఓం బ్రహ్మణ్యాయ ననుః
69 ఓం ముని సంస్తుతాయ నమః
70 ఓం మహోదారాయ నమః
71 ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
72 ఓం సర్వ పుణ్యాధిక ఫలాయ నమః
73 ఓం స్మృత సర్వాఘ నాశనాయ నమః
74 ఓం ఆది పురుషాయ నమః
75 ఓం పరదు పురుషాయ నమః
76 ఓం మహాపురుషాయ నమః
77 ఓం పుణ్యోదయాయ నమః
78 ఓం దయా సారాయ నమః
79 ఓం మహాయోగినే నమః
80 ఓం పురాణ పురుషోత్తమాయ నమః
81 ఓం స్మిత వక్తాయ నమః
82 ఓం మిత భాషిణే నమః
83 ఓం పూర్వ భాషిణే నమః
84 ఓం రాఘవాయ నమః
85 ఓం శ్యామాంగాయ ననుః
86 ఓం సుందరాయ నమః
87 ఓం శూరాయ నమః
88 ఓం పీతవాససే నమః
89 ఓం ధను ర్ధరాయ నమః
90 ఓం సర్వయజ్జాధిపాయ నమః
91 ఓం యజ్వనే నమః
92 ఓం జరామరణ వర్జితాయ నమః
93 ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః
94 ఓం సర్వావగుణ వర్ణితాయ నమః
95 ఓం పరమాత్మనే నమః
96 ఓం పరంబ్రహ్మణేనమః
97 ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
98 ఓం పరం జ్యోతిషే నమః
99 ఓం పరంధామ్నే నమః
100 ఓం పరాకాశాయ నమః
101 ఓం పరాత్పరాయ నమః
102 ఓం పరేశాయ నమః
103 ఓం పారగాయ నమః
104 ఓం సారాయ నమః
105 ఓం అనంతగుణ గంభీరాయ నమః
106 ఓం సర్వదేవాత్మకాయ నమః
107 ఓం సర్వదేవాత్మకాయ నమః
108 ఓం సర్వదేవాత్మకాయ నమః
109 ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
110 ఓం పరాయ నమః


Next -Page


శ్రీ రామ రామ

వసిష్ఠ మహర్షి - Vasishta Maharshi

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.